House Construction: 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? 3 రకాల బడ్జెట్లు మీ కోసం!
amaravathi guntur21 Sep 2026

ఇల్లు కట్టడం ప్రారంభించే ముందే మీ బడ్జెట్ ఎంత, ఎటువంటి నాణ్యతతో ఇల్లు కావాలి అని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ప్రతి దశలోనూ ఖర్చులను అంచనా వేసి, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే, చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి లేకుండా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు..
మీరు 150 గజాల స్థలంలో కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారా? అయితే, నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంటుంది. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు – ఇలా రకరకాల అంచనాలు వినపడుతుంటాయి. ఈ గందరగోళాన్ని నివారించడానికి, 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి అయ్యే నిజమైన ఖర్చును, అది మీ ఎంపికలను బట్టి ఎలా మారుతుందో తెలుసుకుందాం. అయితే సమాచారం డిల్డర్స్, మేస్త్రీలు అందించిన వివరాల ప్రకారం మాత్రమే. మీ ప్రాంతం బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఏరియాను బట్టి ఇసుక, సిమెంట్, మేస్త్రీలు, కూలీల ఖర్చు హెచ్చుతగ్గులు ఉంటాయని గుర్తించుకోండి. అయితే ఈ వివరాలు అంచనా మాత్రమేనని గమనించండి
1.సాధారణ ఇల్లు (బడ్జెట్-ఫ్రెండ్లీ నిర్మాణం)
చదరపు అడుగుల వ్యయం: సుమారు రూ. 1650.
మొత్తం వ్యయం (1350 చ.అ.): రూ. 1650 x 1350 చ.అ. = రూ. 22,27,500.
అంచనా శ్రేణి: రూ. 22 లక్షల నుండి రూ. 23 లక్షల వరకు.
2.స్టాండర్డ్ ఇల్లు (మధ్యస్థ నాణ్యత నిర్మాణం)
చదరపు అడుగుల వ్యయం: సుమారు రూ. 2000.
మొత్తం వ్యయం (1350 చ.అ.): రూ. 2000 x 1350 చ.అ. = రూ. 27,00,000.
అంచనా శ్రేణి: రూ. 25 లక్షల నుండి రూ. 28 లక్షల వరకు
3.ప్రీమియం ఇల్లు (లగ్జరీ నిర్మాణం)
చదరపు అడుగుల వ్యయం: సుమారు రూ. 3000.
మొత్తం వ్యయం (1350 చ.అ.): రూ. 3000 x 1350 చ.అ. = రూ. 40,50,000.
అంచనా శ్రేణి: రూ. 40 లక్షలకు పైగా.
