Back to HomeNews

నమస్కారం... ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో కొత్త సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.

Amaravati Vijaywada 02 Sept 2026
నమస్కారం... ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో కొత్త సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.

ఇకపై 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి అగ్రశ్రేణి APSRTC బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకుంటే... బస్సే వారి ఇంటి వద్దకు వచ్చి పికప్ చేసే విధానాన్ని తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రయాణికులు లగేజీతో బస్టాండ్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే... ఆ ఇబ్బంది చాలావరకు తగ్గే అవకాశం ఉంది. మొదట ఈ సేవను విజయవాడ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ముందస్తుగా బల్క్ బుకింగ్ వివరాలను ఆర్టీసీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే... భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంచే ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేసి తెలియజేయండి.