Back to HomeNews

అమరావతి భూ సమీకరణ మళ్లీ ప్రారంభం..! రెండో విడతలో 20,494 ఎకరాలు.. ఏ గ్రామాలు చేరనున్నాయి?

amaravathi guntur06 Aug 2026
అమరావతి భూ సమీకరణ మళ్లీ ప్రారంభం..! రెండో విడతలో 20,494 ఎకరాలు.. ఏ గ్రామాలు చేరనున్నాయి?

రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత భూ సమీకరణలో 20,494 ఎకరాలను సేకరించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఏ గ్రామాలు ఇందులో ఉన్నాయి? రైతులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో.

రెండో విడతలో 20,494 ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు ప్రధానంగా అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల నుంచి తీసుకోనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో సుమారు 33,000–34,000 ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ ద్వారా సేకరించగా, రెండో విడతతో రాజధాని విస్తరణకు అవసరమైన అదనపు భూమిని సమకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. భూ సమీకరణలో పాల్గొనే రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు, వార్షిక యాన్యుటీ వంటి ప్రయోజనాలు కొనసాగనున్నాయి. 2026లో ప్రభుత్వం యాన్యుటీ పెంపు వంటి అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది