కేంద్ర నిధుల వరద.. అమరావతి అభివృద్ధికి మరో భారీ ఊతం!
amaravathi Guntur28 Jun 2026

పరిపాలనా భవనాలు, మౌలిక వసతులకు రూ.1,300 కోట్లకు పైగా విడుదల.. ఫ్లడ్ పంపింగ్ సిస్టమ్‌కు రూ.444 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం రాజధానిలో పరిపాలనా భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.1,300 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, యుటిలిటీ నెట్‌వర్క్‌లు, ఇతర కీలక మౌలిక సదుపాయాల పనులు మరింత వేగవంతం కానున్నాయి.
