Back to Homeproperties

భవన నిర్మాణ అనుమతుల్లో వినూత్న మార్పులు | AP Building Permissions New Rules 2026 | CDMA Andhra Pradesh

guntur properties team07 Aug 2026real estate guntur properties
భవన నిర్మాణ అనుమతుల్లో వినూత్న మార్పులు | AP Building Permissions New Rules 2026 | CDMA Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతుల (Building Permissions) ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో చిన్న భవనాలకు వేగవంతమైన అనుమతులు, EV ఛార్జింగ్ సదుపాయాలు, మహిళలు మరియు చిన్నారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు వంటి అనేక కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ వీడియోలో ఆ మార్పులు ఏమిటి, ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను పూర్తి వివరాలతో తెలుసుకుందాం.

భవన నిర్మాణ అనుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న మార్పులు!ప్రజలకు భవన నిర్మాణ అనుమతులను వేగంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో పలు నూతన మార్పులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది.🔹 ఇకపై 24 రకాల పత్రాల అవసరం లేదు. కేవలం 12 పత్రాలతోనే భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.🔹 5,000 చ.మీ. పైబడిన కొత్త భవనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయం తప్పనిసరి.🔹 50 మందికి పైగా సిబ్బంది ఉన్న కార్యాలయాలు, మాల్స్, ఆసుపత్రుల్లో శిశు సంరక్షణ కేంద్రాలు (Creches) ఏర్పాటు చేయాలి.🔹 ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించిన నిబంధనలు మరింత సులభతరం.🔹 10 అంతస్తుల కంటే ఎత్తైన భవనాల్లో వాకింగ్ ట్రాక్, జిమ్, గార్డెన్ వంటి సదుపాయాల కోసం ప్రత్యేక అంతస్తుకు అనుమతి.🔹 దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా మందిరాల నిర్మాణానికి ఎలాంటి భవన అనుమతి ఫీజులు ఉండవు.సులభమైన అనుమతులు – వేగవంతమైన అభివృద్ధి – మెరుగైన సేవలు అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు.